![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -383 లో.. నువ్వు వాళ్లకి రింగ్స్ ఇచ్చి చాలా మంచి పని చేసావ్. నువ్వు నా భార్య అవ్వడం నా అదృష్టం. ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అనవసరంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయి బాధ పెట్టానని ఆదర్శ్ అంటు ఉంటాడు. అది విని ముకుంద తనని మోసం చేస్తున్నాననే ఫీలింగ్ వస్తుంది. నీ మనసులో నాకు చోటు ఇచ్చావ్ థాంక్స్ అని ముకుంద చెయ్యి పట్టుకొని ఆదర్శ్ చెప్తాడు.
ఆ తర్వాత కృష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మురారి వచ్చి ఏంటి హ్యాపీగా ఉన్నావని అడుగుతాడు. ముకుంద మీ చేత నా వేలికి ఉంగరం తొడిగించింది చాలా హ్యాపీగా ఉంది. ఎంత మార్పు అని కృష్ణ అనగానే.. అవునని మురారి అంటాడు. అసలు ఉంగరాలు ఎందుకు మార్చుకుంటారో కృష్ణకి మురారి చెప్తాడు. ఆ తర్వాత ముకుంద ఎందుకు ఆదర్శ్ రింగ్ తొడిగించుకోలేదని భవాని ఆలోచిస్తంటుంది. ఇంకా ముకుంద మారలేదు అనుకుంటుంది. అప్పుడే అక్కడికి రేవతి వచ్చి పది రోజుల వరకు ముహూర్తం లేవని చెప్పారు కదా.. అందుకే పెట్టుడు ముహూర్తం పెట్టి పిల్లలకి ఆ శోభనం జరిపిద్దామని భవానితో రేవతి అంటుంది. పది రోజులు ఆగితే ఏం అవుతుంది. అవసరమైతే కృష్ణ మురారీలకి జరిపించు.. ఆదర్శ్ ముకుందలకి వద్దని భవాని చెప్తుంది. ఎన్ని రోజులు ముకుంద నటిస్తు ఉంటుంది. శోభనం జరిపి అందరి జీవితాలు నాశనం చెయ్యలేనని భవాని తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత రేవతిని భవాని అక్కడ నుండి పంపిస్తుంది.
ఆ తర్వాత రేవతి డల్ గా ఉండడంతో కృష్ణ, మురారి వచ్చి.. ఏమైందని అడుగుతారు. జరిగిన విషయం రేవతి వాళ్లకి చెప్తుంది. నేను వెళ్లి మాట్లాడుతానని కృష్ణ రేవతిని తీసుకొని భవాని దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎందుకు వచ్చావని భవాని అడుగుతుంది. రేవతి అడిగిన దానికి అయితే వెళ్ళిపో.. పెట్టుడు ముహూర్తం పెట్టుకొని మీరు ఏర్పాట్లు చేసుకోండి కానీ ఆదర్శ్, ముకుందలకి ఇప్పుడే వద్దు. నేను వాళ్ళ గురించి అలోచించి మాట్లాడుతున్నానని భవాని చెప్తుంది. ఇన్ని రోజులు ఆగింది వాళ్ళ కోసమేగా వాళ్లకి మాకు ఒకేసారి అని భవానికి కృష్ణ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇదే విషయం మురారికి కృష్ణ చెప్తుంది.. తరువాయి భాగంలో మా ఫ్రెండ్ వాళ్ళు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నారు. అందుకు ఆదర్శ్, ముకుంద పేర్లు ఇచ్చామని మురారి అంటాడు. మీరు అందులో పాల్గొని అందరి అనుమానం క్లియర్ చెయ్యండని కృష్ణ అంటుంది. దాంతో ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |